Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) నిర్వహించిన ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2026 (AP LAWCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, 19,197 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 80 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in/LAWCET) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం కల్పించారు. ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆనందం నెలకొంది. అర్హత సాధించిన వారికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>