సంగారెడ్డి ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం!

కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది సమీపంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. పరిశ్రమలోని ఓ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. క్షణాల వ్యవధిలోనే అవి ప్లాంట్ అంతటా భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో ప్లాంట్ లో నిల్వ ఉంచిన ఎలక్ట్రిక్ వాహనాల స్పేర్ పార్ట్స్, ఇతర మెటీరియల్స్ భారీగా కాలిబూడిదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 1 కోటికి పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్లాంట్ లో నిల్వ ఉంచిన వ్యర్థ మెటీరియల్ కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>