సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూటమి పార్టీల నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వవహించారు. వివిధ జిల్లాల నేతుల, బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడి కీలక సూచనలు చేశారు. పోలింగ్ సజావుగా జరిగేలా సంయమనంతో వ్యవహరించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. వైసీపీ పలు చోట్ల అల్లర్లు చేసే అవకాశం ఉందని.. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

ఎక్కడా ఘర్షణలు జరగకుండా కూటమి నేతలు వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందని పలువురు నాయకులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ శాతం పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఓటింగ్ ఎంత పెరిగితే.. ప్రభుత్వంపై పాజిటివిటీ అంతలా పెరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలను మించి నమోదయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>