కలం, వెబ్‌డెస్క్: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ (Khaja Moinuddin) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మొయినుద్దీన్ హత్య కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో (Scorpio Vehicle) వాహనాన్ని గుర్తించిన పోలీసులు వాహన యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ చేయగా.. 6 నెలల క్రితమే కారు అమ్మేసినట్లు స్కార్పియో యజమాని పోలీసులకు తెలిపాడు.
ఆ వాహనాన్ని కొన్నవారు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని యజమాని వెల్లడించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులే కారు కొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల అడ్రస్ కోసం ఆరా తీస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మాసబ్ ట్యాంక్ పరిధిలో జరిగన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ న్యాయవాధి ఖాజా మొయినుద్దీన్ (Khaja Moinuddin) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే.
Read Also: తమిళనాడు సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్..!
Follow Us On : WhatsApp

