Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం ప‌బ్లిసిటీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు: గుడివాడ‌ అమర్‌నాథ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం చంద్ర‌బాబు (Chandrababu) ఎప్ప‌టిలాగానే ప‌బ్లిసిటీ, మార్కెటింగ్‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ (Gudivada Amarnath) విమ‌ర్శించారు. సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాప‌న చేసి, ల‌క్షకు పైగా యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తున్నామ‌ని చెప్పిన‌ నేప‌థ్యంలో అమ‌ర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు జీవితాంతం ఇలాంటి ప్ర‌చారాల‌తోనే ఉంటారా? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వం ఇలా స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు మంచి చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. నిరుద్యోగ‌ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌ని కోరారు. సీఎం చంద్ర‌బాబు ఇలాంటి ప్ర‌చారాలు చేసుకుంటూ ఉన్న‌ప్పుడే.. 32 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పార‌ని, ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధి కల్పించార‌ని ప్ర‌శ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 10 వేల మందికి ఉపాధి పోయింద‌ని, వారికి ఏం స‌మాధానం చెప్తార‌ని అమ‌ర్‌నాథ్ (Gudivada Amarnath) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read Also: రాయపూడి అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>