కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన అవసరాలకు సంబంధించి ఊరటనిచ్చే సమాచారం అందుతోంది. గుజరాత్ తీరానికి చేరుకున్న జగ్ వసంత్ ట్యాంకర్ (LPG Tanker) ద్వారా సుమారు 47 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ భారత్‌కు చేరింది. ప్రస్తుతం అధికారులు ఈ ట్యాంకర్ నుండి షిప్ టు షిప్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి అదనంగా 45 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో ఉన్న పైన్ గ్యాస్ ట్యాంకర్ త్వరలోనే మంగళూరు పోర్టుకు చేరుకోనుంది.
మరోవైపు కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత్‌కు చెందిన మరో 20 ట్యాంకర్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీటిలో 5 ఎల్‌పీజీ ట్యాంకర్లు (LPG Tanker) ఉన్నాయని, ఆ ఐదు ట్యాంకర్ల ద్వారా దాదాపు 2.3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా కానుందని అధికారులు వెల్లడించారు. ఈ సరఫరా ద్వారా దేశంలో గ్యాస్ అవసరాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

