కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ” ది ప్యారడైజ్”(The Paradise). ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో నటించనున్నాడు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మూవీ ఎంతటి ఘనవిజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీనితో ” ది ప్యారడైజ్” మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే నాని (Nani) తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) డైరక్షన్‌లో చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించనున్నారు. గతంలో పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం. త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీలో నాని సరసన క్యూట్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది.
Read Also: రెండు పార్టులుగా వారణాసి..?
Follow Us On: X(Twitter)


