మహిళలు సహకరించుకుంటూ ఆర్థికంగా ఎదగాలి: కలెక్టర్ ఖుష్బూ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహిళలు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, ఒకరికొకరు తోడ్పాటునందించుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించి, మహిళలకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఎన్పరిశీలించారు.

ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉచితంగా నియోజకవర్గంలో అమలు చేస్తున్న యెన్నం హెల్త్ కిట్, హెల్త్ కార్డు, క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్స్, డిజిటల్ లర్నింగ్ సెంటర్లు, మెడికల్, ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షల కోసం నిర్వహిస్తున్న పయనీర్ (PIONEER), NMMS (NATIONAL MEANS MARIT Scholarships) తో పాటు మహిళలకు మహబూబ్‌నగర్ ఫస్ట్’ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ వంటి వినూత్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ విద్యార్థినులు రూపొందించిన పలు కళారూపాలను కలెక్టర్ తిలకించి అభినందించారు.

అనంతరం వివిధ విభాగాలలో శిక్షణ పొందుతున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించారు. శిక్షణ తీరుతెన్నులు, శిక్షణ పూర్తయ్యాక లభించే ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మహిళల కోసం టైలరింగ్ (కుట్టుమిషన్), కంప్యూటర్ బేసిక్స్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ సహా మొత్తం ఐదు విభాగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. కోర్సు ముగిశాక స్వయం ఉపాధికి మాత్రమే కాకుండా, వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా నాణ్యమైన తర్ఫీదు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థినులు ఏర్పాటు చేసిన వివిధ కోర్సుల ప్రాజెక్టులు, ఉత్పత్తులను ప్రదర్శనను సైతం కలెక్టర్ పరిశీలించి వారి నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం రెడ్డి మహిళల హాస్టల్ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథుని మండపాన్ని దర్శించుకుని కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మహిళలోనూ ఏదో ఒక విశిష్ట ప్రతిభ దాగి ఉంటుందన్నారు. “ఒకరికి కుట్టుపనిలో నైపుణ్యం ఉంటే, మరొకరికి మార్కెటింగ్ లేదా కంప్యూటర్ రంగంలో పట్టు ఉండవచ్చు.

ఒకరితో ఒకరు అనవసర పోటీ పడటం కంటే, తమకున్న నైపుణ్యాలను పరస్పరం పంచుకుంటూ జట్టుగా ఏర్పడితే వ్యాపారాల్లో అద్భుత విజయాలు సాధించవచ్చు” అని దిశానిర్దేశం చేశారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, పొందిన శిక్షణను ఆర్థిక ఆదాయ మార్గాలుగా మలచుకోవాలని, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇలాంటి శిక్షణా కేంద్రాలు చక్కటి వేదికలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్.పి. నేహా శ్రీ, ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్‌ఛార్జ్ నిజలింగప్ప, అనిల్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>