నిమ్స్ డాక్టర్ ఇంట్లో సోదాలు.. భారీగా అక్రమాస్తులు

కలం, వెబ్ డెస్క్: నిమ్స్ ఆసుపత్రి డాక్టర్ లక్ష్మీ భాస్కర్ (Lakshmi Bhaskar) ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే. వీటిలో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల విలువ రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో అడిషనల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ భాస్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఆసుపత్రిలో ఎలాంటి నియామకాలైనా ఆయన ఆధ్వర్యంలోనే సాగేవని పేర్కొంటున్నారు.

చీటింగ్ కేసు నమోదైనా..

ఈ క్రమంలోనే లక్ష్మీ భాస్కర్ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ఆయన నివాసం సహా మూడు జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, భూములు, విలువైన ప్లాట్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని పలు మార్లు విదేశీ పర్యటనలు కూడా చేసినట్లు సమాచారం. గతంలోనూ లక్ష్మీ భాస్కర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అయినా ఆయన కీలక పదవిలోనే కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. అక్రమాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>