పవన్ ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్  (Devendra Fadnavis) పరామర్శించారు. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో (రొటేటర్ కఫ్ గాయం) ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) వైద్యుల సూచన మేరకు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఎన్నికల ప్రచారాలు, నిరంతర ప్రజా పర్యటనలు, అధికారిక సమీక్షల ఒత్తిడి కారణంగా ఈ గాయం తీవ్రత పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>