Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్‌లో ముగిసిన సమ్మర్ క్యాంప్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌(Mahabubnagar)లోని  శిల్పారామంలో ప్రభుత్వ నాట్యం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగిసింది.  ఆదివారం ముగింపు సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకకు మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డీఎస్పీ, డీఈఓ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న కళా నైపుణ్యాలను గుర్తించి ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాల ద్వారా వారిని ప్రోత్సహించాలన్నారు. సాంప్రదాయ నృత్యాలు మన సంస్కృతికి ప్రతిబింబాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన చిన్నారులు సాంప్రదాయ దుస్తులలో నృత్య రూపకాలను ప్రదర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>