సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

కలం, వెబ్ డెస్క్: గ్లోబ్ ఏరినా సంస్థ తన బినామీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమన్నారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించినట్లు వివరించారు.

హనుమకొండలో మీడియా చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబ్ ఏరినా సంస్థతో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని, మరి తనదే అయితే ఒప్పందాలు జరుగుతాయా.. అని ప్రశ్నించారు.

నేను రెడీ.. రేవంత్ రెడ్డి సిద్ధమేనా..?

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఒక మూట, బీజేపీకి మరో మూట పంపిస్తున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి కుటుంబం విచ్చలవిడి అవినీతికి పాల్పడుతోందనని.. సిట్, సీఐడీతో విచారణ చేయిస్తారా.. అని ప్రశ్నించారు. తాను సీఐడీ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు.

మోదీని చూస్తే రేవంత్‌కు భయం..

పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని కేటీఆర్ విమర్శించారు. కనీసం ప్రధాని పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. ఎందుకంటే, మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి భయమన్నారు.

లోక్ భవన్ ముందు చేయాల్సిన ధర్నాను.. కొడంగల్‌లో చేయడమంటేనే రాజకీయ నాటకం అన్నారు. పాత కేసుల భయం, ఇతర కాంట్రాక్టుల్లో ప్రయోజనాల కోసమే కేంద్రంతో రేవంత్ రాజీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>