ఫేక్ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త.. సైబర్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అవలంబిస్తూ అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని భారీ మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) తెలిపారు. ముఖ్యంగా “మీ డబ్బులు డబుల్ అవుతాయి”, “సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ”, “100% సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్” వంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసగాళ్లు ప్రజలను వలలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఇటువంటి ప్రకటనలను చూసి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని ప్రజలకు ఆమె సూచించారు. ఇటీవలి కాలంలో నకిలీ పెట్టుబడి పథకాలు, ప్రభుత్వ పేర్లతో నడిచే మోసాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతరం సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఎవరైనా అనుమానాస్పద పెట్టుబడి లింకులు, సోషల్ మీడియా పోస్టులు లేదా ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు పెట్టమని కోరితే వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ నిజమైనదేనా, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా అనే విషయాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఎస్పీ సూచించారు. అధిక లాభాలు, తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పే పథకాలు ఎక్కువగా మోసపూరితమైనవే కావచ్చని హెచ్చరించారు.

అధికారిక ధృవీకరణ లేని లింకులను క్లిక్ చేయడం, వ్యక్తిగత బ్యాంకు వివరాలు, OTPలు లేదా UPI PIN లను ఎవరికీ తెలియజేయకూడదని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ హెల్ప్‌ లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ జానకి ప్రజలను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>