Mobile Popup Ad
Mobile Popup Ad

హెల్త్ కార్డులు మంజూరు చేయాలి : టీయూటీఎఫ్

కలం, నిర్మల్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TUTF) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనాల నుంచి 1.5 శాతం ఈహెచ్ఎస్ చందాను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించకపోవడం బాధాకరమన్నారు. ఆరోగ్య కార్డులను వెంటనే జారీ చేసి, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 30వ తేదీలోపు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వస్తున్న వార్తలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 9 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 60 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అనంతరం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు చేపట్టాలని, మిగిలిపోయిన స్పౌజ్ బదిలీలను పూర్తి చేయాలని కోరారు.

జూలై 31 కట్ ఆఫ్ తేదీతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, ప్రతి మండలాన్ని రెండు క్లస్టర్లుగా విభజించి ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. అదేవిధంగా, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పాఠశాలల కుదింపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీయూటీఎఫ్ (TUTF) జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వహీద్ ఖాన్, రాష్ట్ర సహాధ్యక్షుడు ఎ. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నోముల శరత్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>