మహబూబ్‌నగర్ లో 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అక్టోబర్ 1 నుండి చివరి వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు.

30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జిల్లా (Mahabubnagar) పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>