కలం, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి కేజీబీవీ (Zarugumalli KGBV)లో జరిగిన విద్యార్థినుల అక్రమ తరలింపు ఘటనపై మంత్రి సవిత (Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను తరలించిన వంట మనిషి శోభను విధుల్లో నుంచి తొలగించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. డీఆర్డీఏ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ను సైతం సస్పెండ్ చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్ వార్డెన్లు తప్పకుండా రాత్రి సమయంలో హాస్టల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నామని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

