కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రుద్ర జాగిలంతో హోటళ్లు, ఇతర షాపుల్లో సోదాలు చేపట్టారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా విక్రయాలు, వినియోగం, అనుమానాస్పద కదలికలు గమనిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ రమేష్, డాగ్ హ్యాండ్లర్ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: X(Twitter)

