కలం, కరీంనగర్ బ్యూరో: లయన్స్ క్లబ్ (Karimnagar Lions Club) ఆఫ్ కరీంనగర్ శ్రీ సప్తగిరి 2026-27 6వ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అనవేని శ్రీనివాస్, సెక్రటరీగా ఉశికె మహేష్, కోశాధికారిగా పెద్దిరాజు సత్యనారాయణ రాజులను ఎన్నుకున్నారు. ముఖ్య అతిధిగా పిఎంజిఎఫ్, పిడిజి చిదునర సురేష్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాస్ట్ జోన్ చైర్మన్ గడప కోటేష్ కుమార్ , పాస్ట్ అధ్యక్షుడు కొండం అంజిరెడ్డి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ వి.క్రిష్ణహరి, మైక్రో క్యాబినెట్ గొండోజు లక్ష్మయ్య, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ కొల్లూరి ఆనందం, రీజన్ చైర్ పర్సన్ మారం కుమార్, జోన్ చైర్ పర్సన్ వైద రాజమల్లయ్య, లయన్ మెంబర్స్ పాల్గొన్నారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: Instagram

