కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి కార్యకర్త ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు, నిరసనలు, దీక్షలు చేపట్టి ప్రజల సమస్యలపై పోరాడాలని సూచించారు.
బీజేపీ కార్యకర్తల కృషి, పట్టుదలతో భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి స్థాయిలో స్థానిక సమస్యలపై ఉద్యమాలు కొనసాగించాలని, ప్రతి పోరాటంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్ర నిధులు లేకుండా రాష్ట్రంలో ఏ పథకమూ అమలు కావడం లేదని ఆమె (DK Aruna) వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం రెండూ నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కూడా ఆమె విమర్శలు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

