కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఈ నెల 1 నుంచి జరిగే మధ్యవర్తిత్వం 3.O ను కక్షి దారులు, బాధితులు, వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సూచించారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా న్యాయ సేవ సమితి కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో 3.O ప్రత్యేక మధ్యవర్తిత్వం గురించి పలు విషయాలు వెల్లడించారు.
ఈ జాతీయ మధ్యవర్తిత్వ చట్టం 2023 3.O (ఓ) ప్రత్యేక మధ్యవర్తిత్వం ద్వారా సివిల్ కేసులు, కమర్షియల్ కేసులు, కుటుంబ వ్యవహార వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. మధ్యవర్తిత్వం 3.O ను ద్వారా ఇరుపక్షాల వారు తమ ఇష్ట పూర్వకంగానే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో కేసులను పరిష్కరించుకోవచ్చని తెలపారు. 3.O ప్రత్యేక మధ్యవర్తిత్వం ద్వారా ప్రత్యేక న్యాయవాద బృందాలతో ఇరు వర్గాలకు అనుకూలమైన తీరులో వివాదాలను పరిష్కరించబడతాయని తెలిపారు.

