నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో రజిత (20) అనే నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య (Nursing Student Suicide) చేసుకుని మృతి చెందారు. తన కుమార్తె మృతికి ఒక మహిళ వేధించడమే కారణమని మృతురాలి తండ్రి పోతం రమేష్ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదురావుపేటకు చెందిన రజిత, కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వద్ద ఉన్న ఎస్ఆర్‌ఎం నర్సింగ్ కళాశాలలో జీఎన్‌ఎం రెండో సంవత్సరం చదువుతోంది.

ఆమె డాక్టర్స్ స్ట్రీట్‌లోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ, నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కరీంనగర్‌లోని ఆసుపత్రిలో పనిచేస్తున్న గీత అనే మహిళ, తన స్నేహితుడైన గణపతితో రజిత మాట్లాడుతోందనే నెపంతో తరచూ వేధించేదని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించేదని, తన వేధింపుల గురించి రజిత రూమ్‌మేట్స్‌కు కూడా చెప్పినట్లు తెలిపారు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున హాస్టల్‌లో రజిత అపస్మారక స్థితిలో కనిపించడంతో రూమ్‌మేట్స్ వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రజిత మృతికి గల కారణాలతో పాటు, ఫిర్యాదులో పేర్కొన్న వేధింపుల ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>