అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధురాలు ఐలమ్మ: ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) అని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta ) కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప యోధురాలని, ఆమె స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, డీఆర్‌ఓ ఎ.నిర్మల, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>