మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల (బాలుర) పాఠశాల-2ను ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని, హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించి ఆహార తయారీ నాణ్యత, పరిశుభ్రత మరియు నిర్వహణ తీరును సమీక్షించారు. అలాగే.. వసతి, ఆహారం, పారిశుధ్యం, ఇతర సౌకర్యాల గురించి విద్యార్థుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఖయ్యూం, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>