Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. బడి గోడలపై ఆసభ్యకరమైన రాతలు, అశ్లీల బొమ్మలు

కలం, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. గురుకుల కళాశాల అద్దాలను పగలకొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. అన్ని తరగతుల కిటీకిల అద్దాలు, పర్నీచర్ ధ్వంసం చేశారు. దీనివల్ల లక్షల రూపాయల అస్తినష్టం జరిగింది. అంతేకాదు గోడల పై ఆసభ్యకరమైన రాతలు, అశ్లీల బొమ్మలు గీశారు. గొడలపై వాటిని చూసి ప్రిన్సిపాల్, సిబ్బంది ఖంగుతిన్నారు. ప్రిన్సిపాల్ చాంబర్ లో దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గురుకుల పీఈటీ విష్ణు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దానిలో భాగంగానే గోడలపై అశ్లీల బొమ్మలు అని ఉపాధ్యాయులు ఆరోపించారు.

దీంతో ప్రిన్సిపాల్ గోడలపై రాసిన రాతలను, అశ్లీల బొమ్మలను తుడిచి వేయించి కలర్ ను వేయించారు. పిల్లలను తప్పు దోవ పట్టిస్తున్న గురుకుల PED విష్ణు పై మహబూబాబాద్ RCO కు ప్రిన్సిపాల్ అశోక్ ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి గురుకుల కళాశాల తోటీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫిజికల్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>