రోడ్డుపై గుండె..లివర్‌ను పోలిన అవయవాలు.. పోలీసుల విచారణ

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర బైపాస్‌ సమీపంలో గుర్తుతెలియని అవయవాలు (Organs) కలకలం రేపాయి. వలిగొండ–తొర్రూరు జాతీయ రహదారి పక్కన గుండె, కాలేయాన్ని పోలిన అవయవాలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అవి మానవ అవయవాలా? లేక జంతువులకు సంబంధించినవా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. అవయవాల స్వభావంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పోలీసుల విచారణ అనంతరమే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>