నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్​: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఢీకొని (Nepal Helicopter Crash) కూలిపోయాయి. ఈ ఘటనలో భారత పర్యాటకుడు వసంత్ కుమార్ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం ఖుంబు పసాంగ్​ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నేపాల్​ అధికారులు వెల్లడించారు. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన హెలికాప్టర్లుగా గుర్తించారు.

వసంత్​ కుమార్​ మరణించగా, భారత సంతతికి చెందిన న్యూజిలాండ్​ పౌరుడు శైలేష్​ కుమార్ పటేల్​ గాయపడ్డారు. క్షతగాత్రుడిని హెలికాప్టర్​లో ఖాట్మండ్​ లోని మెడిసిటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెండు హెలికాప్టర్లు ఒకేసారి ల్యాండింగ్ ప్రదేశానికి వచ్చాయి. ఈ క్రమంలో కంట్రోల్ కాకపోవడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>