Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు ఎన్నికల అబ్జర్వర్‌గా మధు యాష్కీ

కలం, నేషనల్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణకు చెందిన పలువురిని ప్రధాన కార్యదర్శి నియమించారు. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud), రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తదితరులను నియమించారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో కొత్తగా 27 మందిని అబ్జర్వర్లుగా నియమించింది. అందులో మధు యాష్కీ, అనిల్ కుమార్ యాదవ్ ఉండడం గమనార్హం. ఈ నెల 23న పోలింగ్ జరగనున్నది. ఎలక్షన్ క్యాంపెయిన్ ఏప్రిల్ 21న ముగియనున్నది. అప్పటివరకు అబ్జర్వర్లు అక్కడే ఉండి పలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టనున్నారు. దానికి అనుగుణంగా ఆ రాష్ట్రానికి చెందిన స్థానిక లీడర్లకు గైడెన్సు ఇవ్వనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>