కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చికిత్స అందించారు. ఈ విషయాన్ని డిల్లీ ఎయిమ్స్ వైద్య విభాగం వెల్లడించింది. తీవ్ర అస్వస్థతకు గురైన జేపీ నడ్డా ఆగస్టు 13న ఆసుపత్రిలో చేరగా.. ఆగస్టు 17న కార్డియాలజీ విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం ఆయనికి యాంజియోప్లాస్టీ చికిత్స అందించినట్లు తెలిపింది. ఈ మేరకు జేపీ నడ్డా ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ప్రస్తుతం జేపీ నడ్డా ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారని బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ విషయం తెలిసి జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఆకాంక్షించారు.

