Mobile Popup Ad
Mobile Popup Ad

మాచర్లలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా మాచర్ల (Macherla) నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సమీపంలోని నగరవనం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, వెనుక నుంచి వచ్చిన ఒక తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులు హైదరాబాద్‌కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా పోలీసులు గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మాచర్ల (Macherla) పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.

Read Also: వైసీపీ, టీడీపీ పోటాపోటీ ప్రోగ్రామ్స్‌.. తాడిప‌త్రిలో హైటెన్ష‌న్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>