Mobile Popup Ad
Mobile Popup Ad

షాకింగ్​​.. తండ్రిని ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచాడు

కలం, వెబ్​ డెస్క్​: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. నీట్‌ పరీక్షకు (NEET Pressure) సిద్ధం కావాలని తరచూ ఒత్తిడి తెస్తున్న తండ్రిని 19 ఏళ్ల కుమారుడు కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి ఇంట్లోనే డ్రమ్‌లో దాచాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ‘వర్ధమాన్ పాథాలజీ’ ల్యాబ్​ నడుపుతున్నారు. అయితే, ఆయన రెండు రోజుల నుంచి ఆయన కనిపించలేదు. దీంతో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో.. ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో తనిఖీ చేయగా, డ్రమ్‌లో దాచిన మృతదేహం బయటపడింది.

దీనిపై మన్వేంద్ర కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను పోలీసులు ప్రశ్నించారు. మొదట పొంతన లేని సమాధానాలు చెప్పిన అక్షత్​ చివరికి నేరాన్ని అంగీకరించాడు(NEET Pressure). నీట్‌ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి పదే పదే మందలించడం, ఒత్తిడి చేయడంతో కొన్నిరోజులుగా తమ ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ క్రమంలో ఇదే విషయమై శనివారం సాయంత్రం మరోసారి గొడవ జరగ్గా, ఆవేశం పట్టలేక తుపాకీతో కాల్చి చంపినట్లు చెప్పాడు. అనంతరం శవాన్ని ముక్కలుగా కోసి డ్రమ్ములో దాచినట్లు వెల్లడించాడు. కొన్ని భాగాలను దగ్గరలోని సదరోనా గ్రామంలో పడేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, అక్షత్ బీకాం విద్యార్థి. ఇంటర్మీడియట్‌లో బయాలజీతో ఉత్తీర్ణుడయ్యాడు. తల్లి 2018లో మరణించగా, అతడు తండ్రి, సోదరితో కలిసి నివసిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>