SIRపై కలెక్టర్లతో ఎన్నికల కమిషన్ సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Mahabubnagar Collector) పాల్గొన్నారు. న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ, హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌వోల) పనితీరును రోజువారీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వాటి నింపడం, డిజిటైజేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలలో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి పనులలో వేగం పెంచాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్‌లో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 10 శాతం లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. తదుపరి సమీక్ష నాటికి వెనుకబడిన జిల్లాలు గణనీయమైన పురోగతి సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాఫర్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>