epaper
Tuesday, February 24, 2026
epaper

పార్కులు, చెరువుల క‌బ్జాల‌పై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో పార్కులు, చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన హైడ్రా (Hydra)  ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితుల నుంచి భారీ స్పందన లభించింది. పాతబస్తీ లాల్‌దర్వాజాలో ఒకప్పుడు గ్రామకంఠంగా ఉన్న 2 ఎకరాల స్థలం పూర్తిగా కబ్జాకు గురైందని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, సికింద్రాబాద్‌ (Secunderabad) లోని హస్మత్‌పేట బోయిన్ చెరువు ఆక్రమణలపై నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు 66 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, ప్రస్తుతం కబ్జాల కారణంగా కేవలం 30 ఎకరాలకే పరిమితమైందని ఆరోపించారు. తక్షణమే స్పందించి మిగిలిన చెరువునైనా కాపాడాలని కోరారు.

మొత్తంగా అందిన 59 వినతులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>