కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ తో ఇండియాలో గ్యాస్ కొరత ఏ స్థాయికి చేరుకుందో చూస్తున్నాం. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ దొరక్క మూతపడుతున్నాయి. అయితే ఇండ్లళ్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కూడా బుక్ (Gas Booking) కావట్లేదు. యుద్ధానికి ముందు ఇలా బుక్ చేస్తే అలా అయిపోయేది. కానీ ఇప్పుడు ఎన్ని సార్లు ఏజెన్సీలకు కాల్ చేసినా బుక్ కావట్లేదని చాలా మంది సతమతం అవుతున్నారు. కాబట్టి సిలిండర్ బుక్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాట్సాప్ నుంచి లేదా ఫోన్ పే నుంచి కచ్చితంగా సిలిండర్ బుక్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం.
వాట్సాప్ ద్వారా..
ఇప్పుడు వాట్సాప్ ద్వారా గ్యాస్ కంపెనీలు సిలిండర్లను బుక్ (Gas Booking) చేసే ఆప్షన్ తీసుకొచ్చాయి. ఒక్కో కంపెనీకి ఒక్కో వాట్సాప్ నెంబర్ ఉంది.
మీరు ఇండెన్ గ్యాస్ వాడుతుంటే.. 7588888824 నెంబర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. అప్పుడు మీకు సర్వీస్ ఆప్షన్లు వస్తాయి. బుకింగ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. 2 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేయగానే మీకు బుక్ అయిపోతుంది. వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
మీరు ఒకవేళ హెచ్ పీ గ్యాస్ వాడుతుంటే.. 9222201122 నెంబర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లో బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. 2 స్టెప్స్ లోనే రిఫిల్ ను బుక్ చేయొచ్చు. వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది.
మీరు భారత్ గ్యాస్ వాడుతుంటే 1800224344 నెంబర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి హాయ్ అని మెసేజ్ టైప్ చేయండి. ఇక్కడ కూడా బుకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. ఈ మూడు కంపెనీలలో బుకింగ్ ఆప్షన్ ఒకే విధంగా ఉంటుంది. సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తే సరిపోతుంది.
ఫోన్ పే ద్వారా..
గ్యాస్ కొరత మరీ ఎక్కువ ఉన్న సమయంలో కొన్ని సార్లు వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ బుక్ కావట్లేదు. ఇలాంటి సమయంలో ఫోన్ పే ద్వారా కచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. మా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్ పేలో బుక్ సిలిండర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు గ్యాస్ కంపెనీల లిస్టు చూపిస్తుంది. అందులో మీది ఏ కంపెనీనో సెలెక్ట్ చేసుకుంటే… అమౌంట్ చూపిస్తుంది. అది పే చేస్తే మీ సిలిండర్ బుక్ అయిపోతుంది. ఫోన్ పే ద్వారా కచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఏజెన్సీ ఆఫీస్ కు కాల్ చేసి ఫోన్ పే ద్వారా బుక్ చేసిన వివరాలు చెబితే సరిపోతుంది. మీ ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది.
Read Also: ఎల్‌పీజీ కొరత వేళ నాదెండ్ల కీలక స్టేట్‌మెంట్
Follow Us On : WhatsApp

