Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంట్రెస్టింగ్‌గా సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్..

కలం, సినిమా : తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya), తెలుగు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబినేషన్‌లో తెరక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ” విశ్వనాధ్ అండ్ సన్స్”(Vishwanath and Sons) . ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మాత నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడం, స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో సూర్య అంతర్జాతీయ పిస్టల్ షూటర్‌గా కనిపించనున్నాడు. క్యూట్ బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి లవ్ చేసే కోణంలో మమితా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీని ఈ ఏడాది జులైలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>