కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో భాగంలో అక్కడి మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని కొట్టిపారేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
Read Also: వాళ్లది వ్యూహమా.. మౌనమా..?
Follow Us On: Instagram

