కలం, వెబ్ డెస్క్ : కొంపల్లి(Kompally)లో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. నైజీరియన్ కు చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకుని వారిని డ్రగ్స్ (Drugs) దందాలోకి దించుతున్నాడు. ఇతన్ని నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ఇండియాకు స్టూడెంట్ వీసా మీద వచ్చాడు. గోవా, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి అడ్రస్ మారుస్తున్నాడు.
ఆల్రెడీ డ్రగ్స్ (Drugs) అలవాటు ఉన్న అమ్మాయిలను ఎంచుకుని వారిని ప్రేమ పేరుతో తన వలలో వేసుకుంటున్నాడు. వారిని నెమ్మదిగా డ్రగ్స్ దందాలోకి దించి.. వారితోనే సరఫరా చేయిస్తుంటాడు. కొంపల్లిలో నర్సుగా పనిచేస్తున్న అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమ పేరుతో వలలోకి దింపి ఆమెతోనే డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడు. యువతి ఉండే ఇంటికి దగ్గర్లోనే ఈ డ్రగ్స్ ఉంచి.. ఆమెతో డ్రగ్స్ వాడేవాళ్లకు సరఫరా చేయిస్తున్నాడు. ఈ డ్రగ్స్ దందా కోసం కోడ్ భాష వాడుతున్నాడు ఈ నిందితుడు. ఇప్పటి వరకు ఏడుగురు యువతులతో సహజీవనం చేసి వారిని ఈ డ్రగ్స్ కూపంలోకి దించాడని పోలీసులు గుర్తించారు.
Read Also: తండ్రి, భార్యలే నిందితులు.. అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు!
Follow Us On: X(Twitter)


