చిత్తూరు హైవేపై అగ్నిప్రమాదం.. లారీలో చెలరేగిన మంటలు

కలం, వెబ్‌డెస్క్: చిత్తూరు (Chittoor) జిల్లా జాతీయ రహదారిపై లారీ దగ్ధమైన ఘట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని బేలుపల్లి క్రాస్ వద్ద రోడ్డు పక్కన నిలిపిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతతో చూస్తుండగానే లారీ దగ్ధమైంది.

అయితే లారీలో మంటలు చెలరేగిన వెంటనే గమనించిన డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా లారీలో స్టీల్ పౌడర్ లోడ్ ఉండడం వల్లే మంటలు ఇంత వేగంగా వ్యాపించాయని, అవి ఇంకా పెరిగే ప్రమాదం ఉందని లారీ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: లోన్, క్రెడిట్ కార్డ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ యాప్‌తో చెక్ పెట్టండి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>