కలం, జనగామ: జనగామ (Jangaon) మార్కెట్ యార్డ్‌లో ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ధాన్యం తరలింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్ యార్డ్‌లో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు మూడు రోజులుగా ఎదురుచూడాల్సి వస్తోందని డ్రైవర్ (Lorry Driver) తెలిపాడు. దీంతో వాహనానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో లారీపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న హమాలీలు వెంటనే అప్రమత్తమై కాపాడారు.
ఈ ఘటనతో మార్కెట్ యార్డ్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఆలస్యంతో రైతులతోపాటు రవాణా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు.

