Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon) నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలకు మేకర్స్ అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభించారు. మే 19 రాత్రి 11:52 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ గ్లింప్స్‌ను ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించడంతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్‌లో ఉపయోగించిన “Nationwide Destruction Protocol” ట్యాగ్ అభిమానులలో మరింత హైప్ పెంచుతోంది. ఎన్టీఆర్-నీల్ హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>