కలం, కరీంనగర్ బ్యూరో : లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తగిరి (Lions Club of Saptagiri) ఆధ్వర్యంలో, స్థానిక శివ ఎలైట్ కిడ్నీ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన రెండు రోజుల ఉచిత వైద్య శిబిరానికి (Free Health Camp) విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. వివిధ విభాగాల స్పెషలిస్టు వైద్యులు రోగులను పరీక్షించారు. వైద్యులుగా డా. శివకుమార్, డా. పి. నిరోష, డా. మేఘన, డా. మొహియుద్దీన్ పాల్గొని సేవలందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, మిల్స్ ఆన్ వీల్స్ జిల్లా కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, మాజీ జిల్లా కోఆర్డినేటర్ పోరెడ్డి శ్రీహరి రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు కొండం అంజిరెడ్డి, సెక్రటరీ అన్నమనేని శ్రీనివాస్, ట్రెజరర్ ఉష్కె మహేష్, వైస్ ప్రెసిడెంట్ కానుగంటి రమణారెడ్డి, పర్రె రాజేశం తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలు ఈ సేవలను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని కోరారు.

