కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఈనెల 12వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన పార్టీ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మరియు శాసనమండలి పక్షాల ఉప నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జిల నియామకం, పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేసీఆర్ సమావేశం కావడంతో ఆయన చేసే వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది.

