మెస్సీ ఖాతాలో మ‌రో రికార్డు..!

క‌లం, వెబ్ డెస్క్: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్‌ మెస్సీ (Lionel Messi) మరో అరుదైన రికార్డు సృష్టించాడు. అమెరికాలోని కాన్సాస్ సిటీలో అల్జీరియాతో జరిగిన వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఆయన గోల్ చేయడం ద్వారా, ఐదు వేర్వేరు వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నమెంట్లలో గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ గోల్‌తో మెస్సీ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సరసన నిలిచారు. రొనాల్డో 2022లోనే ఈ రికార్డు సాధించాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో రొనాల్డో కూడా తన 6వ ప్రపంచకప్‌ బరిలోకి దిగనున్నారు.

ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో మెస్సీ ప్రపంచకప్ కెరీర్‌లో మొత్తం 14 గోల్స్ పూర్తి చేసుకున్నారు. తద్వారా ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీకి చెందిన గెర్డ్ ముల్లర్, ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పేలతో కలిసి మెస్సీ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్) అగ్రస్థానంలో ఉండగా, రొనాల్డో (15 గోల్స్) రెండో స్థానంలో ఉన్నారు. 2006లో సెర్బియా, మోంటెనెగ్రోపై మెస్సీ తన మొదటి ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం, అదే రోజున ఈ చారిత్రాత్మక గోల్ నమోదు కావడం ఒక విశేషం. మ‌రోవైపు మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో మైలురాయి. ఇక ప్ర‌పంచంలో 200 మ్యాచ్‌లు పూర్తి చేసిన మూడో ఆట గాడిగా మెస్సీ మ‌రో రికార్డు సృష్టించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>