కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత గురించి తెలిసిన గొర్రెల కాపరులు గుట్ట వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత గొర్రెల మంద వద్దకు వచ్చి ఓ గొర్రెను ఎత్తుకెళ్లినట్లు పశువుల కాపరులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ బీట్ అధికారి రాములు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత జాడ కోసం అన్వేషిస్తున్నారు. చిరుత కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు.

