న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‎లో సంచలనం సృష్టించిన న్యాయవాది మొయిజుద్దీన్ (Lawyer Moizuddin Murder Case) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కబాడిగూడకు చెందిన వినయ్‎ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనే న్యాయవాది ముయిజుద్దీన్‎ను కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు వినయ్‎తో సహ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గోవాలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

శనివారం ఉదయం హైదరాబాద్‎లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది ముయిజుద్దీన్‎ను నిందితులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న క్రమంలో కారులో వేగంగా వచ్చిన నిందితులు ముయిజుద్దీన్‎ను ఢీకొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముయిజుద్దీన్ కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

అయితే కాంగ్రెస్‌ నాయకుడు ముజాహిద్‌ ఆలంఖాన్‌, మహబూబ్‌ ఆలంఖాన్‌లే తన తండ్రిని చంపించారని మొహియుద్దీన్‌ కుమారుడు ఫర్హాన్‌ ఆరోపించారు. నవాబ్‌షా ఇంజనీరింగ్‌ కాలేజ్‌, అన్వర్‌ ఉల్‌ ఉలూం వక్ఫ్‌, ముంతాజ్‌ యావిద్దుల వక్ఫ్‌ వంటి ఆస్తులు వక్ఫ్‌ బోర్డుకు సంబంధించినవి. వాటిని ఆక్రమించడంతో కొన్నేళ్లుగా మా నాన్న న్యాయస్థానం ద్వారా పోరాడుతున్నారని, అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు ఆరుసార్లు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>