Mobile Popup Ad
Mobile Popup Ad

ల్యాప్‌టాప్ వేడెక్కుతుందా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

కలం, వెబ్‌డెస్క్: నేటి డిజిటల్ యుగంలో విద్య, వ్యాపారం, వినోదం, కమ్యూనికేషన్ రంగాలలో ల్యాప్‌టాప్ (Laptop) ఒక ప్రాథమిక అవసరంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగాలు, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో ఎడిటింగ్, గేమింగ్ ఇలా దాదాపు ప్రతి పని ల్యాప్‌టాప్‌పైనే ఆధారపడుతోంది. గంటల తరబడి ల్యాప్‌టాప్ ఉపయోగించడం ఇప్పుడు చాలామందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే ఎక్కువగా ల్యాప్ టాప్‌ను ఉపయోగించడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ముఖ్యమైంది “ల్యాప్‌టాప్ హీట్ అవడం” (Laptop Overheating).

కొద్దిసేపు ఉపయోగించగానే ల్యాప్‌టాప్ వేడెక్కిపోవడం, ఫ్యాన్ పెద్దగా శబ్దం చేయడం, సిస్టమ్ స్లో అవడం, స్క్రీన్ ఫ్రీజ్ కావడం లేదా ఒక్కసారిగా ఆఫ్ అయిపోవడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలామంది ఈ సమస్యను మొదట్లో పెద్దగా పట్టించుకోరు. “వేడెక్కడం సాధారణమే” అని భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలం పాటు ల్యాప్‌టాప్ అధికంగా వేడెక్కితే మదర్‌బోర్డ్, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి కీలక భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొన్నిసార్లు ఖరీదైన రిపేర్ ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది. కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా ల్యాప్‌టాప్ హీట్ సమస్యను తగ్గించి, దాని లైఫ్‌ను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ మంచం, దిండు, కంబళి వంటి మృదువైన ఉపరితలాలపై పెట్టి ఉపయోగించకూడదు. అలా చేస్తే ల్యాప్‌టాప్‌లోని గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీంతో లోపలి వేడి బయటకు వెళ్లక హీట్ మరింత పెరుగుతుంది. ఎప్పుడూ టేబుల్ లేదా గట్టి ఉపరితలంపై ఉంచి ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్ ఎక్కువగా వేడెక్కడం వల్ల పనితీరు తగ్గిపోవడమే కాకుండా మదర్‌బోర్డ్, బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>