కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో (IPL 2026) ముంబై ఇండియన్స్ జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఓడిపోయాక, జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచాడని ఆయన ఒప్పుకున్నారు. మేనేజ్‌మెంట్ ఆశించిన స్థాయిలో పాండ్యా నాయకత్వం సాగలేదని, అయితే అతనికి ఫ్రాంచైజీ తరఫున అన్ని రకాల మద్దతు, అవకాశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ ఘోర వైఫల్యానికి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయలేమని, ఇది జట్టు మొత్తం చేసిన ఉమ్మడి తప్పని చెప్పారు. ప్రస్తుతానికి ఈ ఓటమి బాధ నుంచి కోలుకుని, వచ్చే సీజన్ నాటికి బలంగా తిరిగి రావడమే తమ లక్ష్యమని పొలార్డ్ వివరించారు.
వచ్చే సీజన్ కోసం జట్టులో మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చిన పొలార్డ్ (Kieron Pollard), ఇప్పుడే కంగారుపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. సీనియర్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో కూల్‌గా సమీక్షించుకున్నాకే యాజమాన్యం బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఇక చివరి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతి ఇవ్వడంపై స్పందిస్తూ, ఈ మ్యాచ్ గెలిచినా వచ్చేది రెండు పాయింట్లేనని, అందుకే యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు బుమ్రాకు (Hardik Pandya) రెస్ట్ ఇచ్చామని తెలిపారు. పైగా భారత క్రికెట్‌కు బుమ్రా ఒక విలువైన ఆస్తి అని, అతనికి విశ్రాంతి ఇవ్వడమే తెలివైన నిర్ణయమని పేర్కొన్నారు. టోర్నమెంట్ పొడుగునా తాము అస్సలు బాగా ఆడలేదని, తమ ఆటతీరుకు పట్టికలో ఏ స్థానానికి అర్హులో అదే దక్కిందని పొలార్డ్ ముగించారు. రాబోయే రోజుల్లో ముంబై (MI) మేనేజ్‌మెంట్ ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Read Also: కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్లను అసలు మిస్ అవ్వొద్దు!
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

