మొంథా తుపాను కారణంగా భారీగా పడిన వర్షాలతో మల్కాజ్‌గిరి(Malkajgiri)లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జీహెచ్ఎంసీకి చెందిన చెత్త సేకరణ వాహనం ధ్వంసమయింది. కొండ రాళ్ల కింద పడి నుజ్జు నుజ్జు అయింది. వాహనంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ ఘటన మల్కాజ్‌గిరి గౌతమ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు షాకయ్యారు. తాము వాహనం పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లినందున, పెద్ద ప్రమాదం తప్పిందని జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు. కాగా, కొండపై మరో రాయి కూడా పడేలా ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు కోరుతున్నారు.
Read Also: పంత్‌కు కోహ్లీ జెర్సీ నెంబర్..!

