కలం వెబ్ డెస్క్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి(Maredumilli)లో పోలీసులు ల్యాండ్ మైన్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్లు(Landmines), ప్రెజర్ మైన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. పర్యాటకులు ఎవరూ అడవి లోపలికి వెళ్లవద్దని సూచించారు. భద్రతా దళాలను హతమార్చేందుకే మావోయిస్టులు(Maoist) ల్యాండ్‌మైన్లు అమర్చినట్లు చెప్పారు. నిపుణులతో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంకా ఏయే ప్రాంతాల్లో, ఎన్ని అమర్చారన్నదానిపై అణ్వేషిస్తున్నామన్నారు. పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మారేడుమిల్లిలో ఇటీవల భారీ మావోయిస్ట్ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ల్యాండ్‌మైన్లు గుర్తించడంతో ఆందోళన నెలకొంది.


