కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘ఆవకాయ అమరావతి’ (Avakaya Amaravati) కార్యక్రమానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. జనవరి 8 నుంచి 14 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూమిని కూడా ఎంపిక చేసుకున్నది.
అయితే ఇప్పుడు భూ యజమానులు ఎదురుతిరిగారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు. దీంతో ఆవకాయ అమరావతి (Avakaya Amaravati) కార్యక్రమంపై అనుమానాలు కలుగుతున్నాయి. పున్నమి ఘాట్ ప్రైవేట్ ల్యాండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు.
అయితే ప్రస్తుతం ఈ భూమి యజమానులు తమ అనుమతి లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం భూ యజమానులతో రాజీ కుదుర్చుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: దత్తత తీసుకున్న గ్రామంలో నిర్మలా సీతారామన్ పర్యటన
Follow Us On : WhatsApp


