కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి (Bhupalpally ) జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ సమీపంలోని ఎల్ అండ్ టీ గెస్ట్ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని సోమవారం పరిశీలించి విచారణ చేశారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

